ఏపీ సీఎం చంద్రబాబు నాయడు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : 2026 నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఏరియల్ సర్వే ద్వారా భోగాపురం విమానశ్రయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాం తానికి మంచి అవకాశాలున్నాయన్నారు.
గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడే అన్ని రకాల అనుమతులు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల అన్ని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తోందన్నారు. భోగాపు రం విమానశ్రయం ప్రారంభంలోనే నిత్యం 48 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే పరిస్థితి ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన అవసరం ఉం డదన్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం మొదటి దశ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వేగంగా పూర్తి చే యించే బాధ్యత కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిపై ఉందన్నారు.