calender_icon.png 26 November, 2024 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్

06-11-2024 01:27:34 AM

అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అందజేశారు. మంగళవారం హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి అవార్డులను అందచేశారు.

హైజీనిక్ కండీష న్‌లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనల పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ (బ్లిస్‌ఫుల్ అండ్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్) సర్టిఫికెట్ ఇస్తారు.

భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆలయాల ప్రసాద తయారీ కేంద్రాలను పలుమార్లు పరిశీలించిన అనంత రం, అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నట్టు నిర్ధారించుకుని ఈ సర్టిఫికెట్లను ఇస్తారు. మన రాష్ర్టంలో యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహ స్వామి టెంపుల్, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ సహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సర్టిఫికేషన్ ఉంది.