21-04-2025 12:58:33 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని, సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వం విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో ఆదివారం భోగ్ బండారో వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎనలేని కృషి చేస్తుందని, డోర్నకల్ నియోజకవర్గంలో రూ.150కోట్ల అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని, త్వరలోనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నాడు ఇందిరమ్మ గిరిజనులకు సాగుభూములు అందించిందని, నేడు రేవంత్ రెడ్డి సర్కారులో బంజారులకు సముచిత ప్రాధాన్యత కల్పింస్తోందని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ కమిటీ అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ ఆధ్వర్యంలో మరిపెడ పట్టణంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ భండారో కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సేవాలాల్ దాదాపు 300ఏళ్ల క్రితమే పశువులకు మనుషులకు వైద్యం చేశేవారని, ఆ రోజుల్లో బంజారాలు ఏ విధంగా జీవించాలి అన్న విలువలు నేర్పిన మహనీయుడు సేవాలాల్ అని కొనియాడారు. అహింసే మార్గంగా మానవులతో పాటుగా జంతు జీవజాలంతో మమేకమైన జీవనం గడిపిన గోప్ప మహర్షి సేవాలాల్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజారాలకు న్యాయం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైయ్యాకా బంజారుల పండుగలైన తీజ్, సీత్లా, భోగ్ బండారో పండుగలకు ఐచ్చిక సెలవు అడిగిన వెంటనే మంజూరు చేయటం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 15కోట్ల మంది బంజారాలు ఉన్నారని, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచడానికి 8వ షెడ్యూల్ లో చేర్చాలని కోరగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, వైస్ చైర్మెన్ పెద్దబోయిన ఐలమల్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, బండి శ్రీను, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీను, నూకల అభినవ్ రెడ్డి, మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్,
మండల నాయకులు కోట వెంకట్ రెడ్డి, బోర గంగయ్య, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, విసారపు శ్రీపాల్ రెడ్డి, అఫ్జల్, గడ్డం వెంకట్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు బోడ రవి, భూక్య కృష్ణ, నరేష్, వాంకుడోతు రవి, మహేష్,గుగులోత్ పాప, బానోతు కర్ణ, భౌవ్ సింగ్, గుగులోతు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.