శ్రీవారి 110 శ్రీమద్ భాగవత సప్తహ మహోత్సవాలు ప్రారంభం...
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి 110 శ్రీమద్ భాగవత సప్తహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నుండి ఆలయంలో శ్రీ స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మన్యం బాచలా క్షేత్ర దేవి పెద్దగంటి ఎల్లమ్మ దేవికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తరఫున సౌభాగ్య సారే ను అర్చకులు సమర్పణ చేశారు. సప్తాహ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు కావడంతో గ్రామదేవతలు ఎల్లమ్మ తల్లికి సారే సమర్పణ జరిగింది. సోమవారం నుండి పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు నిర్వహకులు తెలిపారు.
ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు ఉంటాయని ప్రతి యేడు ఉత్సవ మొదటిరోజు పెద్దగంటి ఎల్లమ్మ తల్లికి సౌభాగ్య సారే సమర్పణ చేసే సాంప్రదాయం ఏలుగా కొనసాగుతుందని కార్తీక మాసంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు కూడా ఎల్లమ్మ తల్లికి సౌభాగ్య సారీ సమర్పణ చేయనున్నట్టు వారు తెలిపారు. శ్రీ మద్భగవత సప్తహ మహోత్సవాల ప్రారంభం రోజు అయిన సోమవారం ప్రారంభించమన్నారు. వైశాఖ మాసంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామ దేవత ఎల్లమ్మ తల్లికి సౌభాగ్యసారే సమర్పణ చేయడం జరుగుతుందని అర్చకులు తెలిపారు.
భీంగల్ పట్టణంలో ఒక వంద పది ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని భీంగల్ ప్రజల ప్రాణాలు కాపాడాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిపై నమ్మకంతో స్వామివారికి ముడుపులు కట్టేవారని స్వామివారిని సేవించడంతో ప్లేగు వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తే ఉత్సవాలు చేస్తామని ముడుపులు కట్టడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చిన నాటి నుండి స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయని అర్షకులు తెలిపారు. పెద్దగంటి ఎల్లమ్మ దేవికి ముడుపులు కట్టి మొక్కగానే ప్లేగు వ్యాధి నియంత్రణలతో ఉత్సవాలు చేశారని అలాగే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.