మంథనిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్
మంథని, (విజయక్రాంతి): బాబాసాహెబ్ అంబేద్కర్ కారణజన్ముడని, మంథనిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు. మంథని పట్టణం లోని అంబేద్కర్ చౌక్ లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు, చైర్ పర్సన్ లు మాట్లాడుతూ.. అంబేద్కర్ కారణజన్ముడని, బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయులని అన్నారు. నేడు ఆ మహానుభావుడని, అందరూ ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయమని, ఆయనపట్ల భక్తి భావనే లండన్ లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని ప్రజలు సందర్శించేలా చేశారని, దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ ఉండటం గర్వకారణంన్నారు.
నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను ముందే పసిగట్టి భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా, ప్రపంచం అంబేద్కర్ ను కొనియాడిందని, ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నాయకులు కుడుదుల వెంకన్న, లింగన్న యాదవ్, మోహన్ యాదవ్, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.