calender_icon.png 16 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే మార్గ నిర్దేశుకులు బీం రావ్ అంబేద్కర్

14-04-2025 05:36:49 PM

ఎస్ఐ గోపి కృష్ణ..

పెన్ పహాడ్: అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక రాజకీయ హక్కులు, రాజ్యాంగ రూపాకల్పనలో ఆయన చేసిన కృషి మరువలేమని ఎస్ఐ గోపి కృష్ణ అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దూపాడ్ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధి గా విచ్చేసి మాట్లాడారు. ఏ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ దేశానికి చేసిన సేవలపై గ్రామస్తులకు గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన లో ప్రతి ఒక్కరు పయనించాలన్నారు. అలాగే పెన్ పహాడ్, అనంతారం, అనాజీపురం, అన్నారం, తదితర గ్రామాలలో 'డిబీఎస్యూ' ఎం ఆర్ పీ ఎస్, విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘణంగా నిర్వహించారు. కార్యక్రమం లో దాసరి శ్రీను, కత్తి ఉపేందర్, నర్సయ్య తదితరులు ఉన్నారు.