calender_icon.png 7 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమ్‌పూర్@5.9 డిగ్రీలు

06-01-2025 12:08:49 AM

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూ  ఆదివారం అత్యంత తక్కువగా 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను చలిగాలులు  వణికిస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలో సోమవారం చలితీవ్రత ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చలిగాలలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో పది జిల్లాలో 10డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉనమోదయ్యాయి. అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 6.0డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.