calender_icon.png 12 December, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమ్‌పూర్ @ 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత

12-12-2024 02:05:29 AM

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో అత్యల్పంగా 8.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నది.