calender_icon.png 24 December, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"లగ్గం టైమ్‌" ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర

06-11-2024 06:10:36 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా కొత్త నిర్మాణ సంస్థలు లాంచ్ అవుతుంటాయి. మంచి కథలు దొరకగానే వెంటనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఇవి సిద్ధమవుతుంటాయి. తాజాగా కొత్త నిర్మాణ సంస్థ "20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌" తమ ఫస్ట్ మూవీ టైటిల్‌ను ప్రకటించింది. తమ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మొదటి చిత్రానికి ‘లగ్గం టైమ్‌’ అని టైటిల్‌ పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు, ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజేష్ మేరు, నవ్య చిత్యాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ కథకు బలం చేకూర్చుతున్నారు.

ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం కథ అందించడమే కాకుండా డైరెక్ట్ చేస్తున్నారు. కె.హిమ బిందు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా పవనే అందిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్‌ను ఆదిత్య మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ‘లగ్గం టైమ్‌’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. సాగర్ కె చంద్ర ‘బీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘లగ్గం టైమ్‌’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన సాగర్ కె చంద్ర, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు.

వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేసే సినిమాలా దీనిని తీస్తున్నామని మూవీ మేకర్స్ వెల్లడించారు. ‘లగ్గం టైం’ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది, కథ ఏమిటి అనే విషయాలను తెలియజేస్తూ చిత్ర బృందం త్వరలోనే ప్రకటన చేయనుంది. ‘లగ్గం టైమ్‌’ మూవీ కోసం ఆడియన్స్ ఎదురు చూడటం మొదలు పెట్టేశారు. కొత్త కథ, కొత్త నటీనటులతో ఇది కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని పలువురు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.