17-03-2025 05:41:11 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు గ్రామ తైబజార్ వేలంపాట ఈనెల 20న నిర్వహించనున్నట్లు సోమవారం గ్రామ సచివాలయ ఈవో మహేష్ గౌడ్ తెలిపారు. మండల పంచాయతీ అధికారి అధ్యక్షతన గ్రామ సచివాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట జరుగుతుందన్నారు. వేలం పాటలో పాల్గొనేవారు రూ. పది వేలు డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు. గ్రామపంచాయతీ నిబంధనల మేరకు వేలంపాట కొనసాగుతుందని తెలిపారు.