calender_icon.png 29 April, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవం

28-04-2025 08:20:17 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు(Jukkal MLA Thota Lakshmi Kantha Rao) నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను మల్లికార్జున కురుమ సంఘం వారు గొంగళి కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు గోసాయిపల్లి మల్లేశం మాట్లాడుతూ... బీరప్ప కామరథిల కల్యాణ మహోత్సవాలు ఈ నెల 23న ప్రారంభమయ్యాయని మే 2న ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలు కురుమ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థుల సహాకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం, పెద్ద కొడప్గల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మండ్లు, మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్ప పటేల్, సాయిరెడ్డి, పాపిరెడ్డి, ఇస్మాయిల్ పటేల్, లింగం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.