25-02-2025 12:49:54 AM
పటాన్‌చెరు, ఫిబ్రవరి 24 : జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబ యింది. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఐదు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25వ తేదీ మంగళవారం గణపతి పూజ, ధ్వజారోహణం, 26వ తేదీ బుధవారం అగ్నిగుం డాలు, 27వ తేదీ గురువారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, 28వ తేదీ శుక్రవారం స్వామివారి త్రిశూల స్నానం, మార్చి 1వ తేదీ స్వామివారికి పంచామృతాభిషేకం, పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. భక్తుల కోసం తాగునీటి సౌకర్యంతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు, వైద్య సదుపాయాలు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన కోనేరు ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. ఆలయం ఎదుట ఈశాన్యంలో ఏర్పాటు చేసిన కోనేరు మధ్యలో శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.