calender_icon.png 13 March, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమ్ దీక్ష పోస్టర్లు ఆవిష్కరణ

12-03-2025 10:50:37 PM

మోతే: మండల స్వేరోస్ నూతన అధ్యక్షుడిగా అన్నారిగూడెం గ్రామానికి చెందిన దున్నపోతుల దుర్గారావును ఎన్నిక చేసినట్లు స్వేరోస్ జిల్లా నాయకులు చెడపంగు నాగార్జున,జిల్లపల్లి శివకృష్ణ తెలిపారు. బుధవారం మోతె మండల కేంద్రంలో జరిగిన స్వేరోస్ కార్యకర్తల సమావేశంలో ఎన్నిక చేసి నియామక పత్రం అందించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగే భీమ్ దీక్ష విజయవంతానికి భీమ్ దీక్ష పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో మోతె  కార్యదర్శి బక్కయ్య, స్వేరోస్ సీనియర్ నాయకులు పల్లెల లక్ష్మణ్, ఎల్.ఎన్ రాజు, స్వేరోస్ మండల ప్రధాన కార్యదర్శి తుర్క మహేష్, ఉపాధ్యక్షులు నిమ్మనగోటి నవీన్ కుమార్, స్వేరో ఆర్గనైజింగ్ సెక్రటరీ లంజపల్లి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ దోసపాటి తరుణ్, కోశాధికారి యాతాకుల ప్రభాకర్, దోసపాటి ఉపేందర్, గురిజాల రమేష్, ఉపేందర్  లు తదితరులు స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు.