13-03-2025 07:26:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): మార్చి 15 మాన్యవర్ కాన్షిరాం జయంతి(Manyavar Kanshiram Birthday)ని పురస్కరించుకొని ఏప్రిల్ 14 బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వరకు జరిగే భీమ్ దీక్షను విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్(Ambedkar Youth Association District President Bathula Ranjith) అన్నారు. భీం దీక్ష అంటే జ్ఞాన దీక్ష అని దీనిని జిల్లాలోని అన్ని గ్రామాలలోని అంబేద్కర్ సంఘం సభ్యులు నాయకులు తప్పకుండా భీమ్ దీక్షని స్వీకరించాలని కోరారు. దీక్ష ప్రారంభ కార్యక్రమం నిర్మల్ సోఫీ నగర్ లో గల బుద్ధ విహార్ కేంద్రంలో ఈనెల 15 తారీకున జరుగుతుందని ఇట్టి కార్యక్రమాన్ని అంబేద్కర్ సంఘ నాయకులు సభ్యులు బహుజనవాదులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా ట్రెజరీ సేపురి సిద్దు, జిల్లా నాయకులు ఆకుల రమేష్, పులి అశోక్, పుష్పుర్ సతీష్ తదితర నాయకులు సభ్యులు హాజరయ్యారు.