calender_icon.png 16 January, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో భవ్య, లక్ష్యయ్

15-01-2025 11:52:32 PM

జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: భారత షూటర్లు లక్ష్యయ్ షెరాన్, భవ్య త్రిపాఠి జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. బుధవారం జరిగిన షాట్‌గన్ ట్రాప్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు ఢిల్లీ జట్టును ఫైనల్స్ చేర్చారు. మహిళల విభాగంలో రాజేశ్వరీ కుమారి (పంజాబ్ ) 114 పాయింట్లతో టాప్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించగా.. భవ్య (110 పాయింట్లు) , సబీరా హారిస్ (ఉత్తర్‌ప్రదేశ్), శ్రేష్ఠ సిసోడియా (మధ్యప్రదేశ్) కూడా ఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల విభాగంలో లక్ష్యయ్ షెరాన్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 121 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచాడు. ఫైనల్లో పృథ్వీరాజ్ తొండైమాన్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.