calender_icon.png 7 March, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా భవాని

07-03-2025 12:55:36 AM

అశ్వరావుపేట, మార్చి 6, (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గంలోని దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జిగా బి భవాని నియమించారు. గురువారం కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే సాయి శ్రీ నుండి భవాని బాధ్యతలు తీసుకున్నారు. 2014లో జూనియర్ సివిల్ జడ్జిగా రంగారెడ్డి జిల్లాలోని కూకట్పల్లిలో ఆమె పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా భవాని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.