01-03-2025 12:08:14 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 28: నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భవాని నియమితులయ్యారు. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ డాక్టర్ రేమా శ్రీ సుగంధ ద్రవ్యాలు బోర్డు, పసుపు బోర్డు మధ్‌య కార్యకలాపాలను సమన్వయం చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.