సప్తగిరి, ధన్‌రాజ్, శకలక శంకర్, అజయ్, మాళవిక సతీశన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. ‘ది హాంటెడ్ హౌస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ‘భవనమ్’ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని మేకర్స్ బుధవారం వెల్లడించారు. గెటప్ శ్రీను, మురళీగౌడ్, జీవన్ నాయుడు, శ్రవణ్, నాగ మహేశ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: మురళీ మోహన్ రెడ్డి ఎస్; స్టంట్స్: స్టార్ మల్లి; కొరియోగ్రఫీ: బాలకృష్ణ, శ్యామ్‌కుమార్; ఆర్‌ఆర్: డీఎస్‌ఆర్.