calender_icon.png 19 April, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భట్టి ఆదేశాలు బేఖాతర్?

09-04-2025 02:01:21 AM

  1. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుకు ఇక్కట్లు
  2. ధ్రువ పత్రాలు కోసం నిరుద్యోగుల అపసోపాలు
  3. డిప్యూటీ సీఎం మాటకే దిక్కు లేదు
  4. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

కరీంనగర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినా, ధ్రువ పత్రాల కోసం నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముక్షంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

రేషన్ కార్డు లేనివారి లో ఆందోళన చోటు చేసుకోగా బ్యాంకు కాన్సెంట్ షరతులతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు.  దరఖాస్తుల కోసం మీ-సేవా కేంద్రాల వద్ద నిరుద్యోగులు బారులు తీరుతున్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నా, ఫారాలను ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందజేయాల్సి వస్తోంది. మీ- సేవా కేంద్రాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత ఏప్రిల్ 5 వరకు గడువు విధించినా, ఇటీవల 14 వరకు పొడిగించారు. గడువు మరో నాలుగు రోజిలు మాత్రమే మిగిలి ఉంది. ధ్రువ పత్రాల జారీలో జాప్యం కారణంగా నిరుద్యోగులు మీ-సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు చాలా చోట్ల భేఖాతరు చేస్తున్నారు.  రెవెన్యూ శాఖలో ప్రత్యేక విభాగం లేకపోవడం కూడా జాప్యం కారణమవుతుంది. వరుస సెలవులు కారణమయ్యాయి అంటూ జాప్యం చేస్తున్నారు. పథకం మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో, వేలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెండడంతో పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదు. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి.

అని భట్టి  ఆదేశించారు. అయితే వీటితోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రం జతచేసి ఆన్లైన్లో అయినా సరే... లేదంటే ఆఫ్ లైన్ ద్వారా సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అందజేయవచ్చని తాజాగా పేర్కొనగా ఆదాయ ధ్రువపత్రాలు జారీ కి కష్టం అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరో పక్క  పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ లేకపోవడం, వివాహాల తర్వాత పేర్లు మార్చకపోవడం వంటి కారణాలతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలకు బ్యాంకు కాన్సెంట్ తప్పనిసరిగా ఉండడంతో, చాలామంది నిరుద్యోగులు రుణాలు పొందలేకపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నా, బ్యాంకు రుణం కోసం షరతులు లేకుండా నేరుగా మంజూరు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

రోజుల తరబడి తిరుగుతున్నరు

కరీంనగర్ నగరంలో వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం రోజుల తరబడి తిరుగుతున్న పత్రాలు మాత్రం ఇవ్వడం లేదు. రోజుల బడి తిరుగుతున్న అధికారులు కుంటి సాకులు చెప్తూ కాలయాత్ర చేస్తున్నారే కానీ ధ్రువీకరణ పత్రాలు సరిగా ఇవ్వడం లేదని నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ  నెలకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి వెంటనే ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన ఏరోజుకారోజు ఇచ్చే విధంగా తన చర్యలు తీసుకొని నిరుద్యోగులు ఆదుకోవాలి

పైడిపల్లి రాజు, సీపీఐ నాయకుడు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నరు

రాజీవ్ యువ వికాసం సంబంధించి బడుగు బలహీన వర్గాలకు  లోన్ల విషయంలో బీసీలకు కుల సర్టిఫికెట్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్కు, ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలని చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఆదాయ సర్టిఫికేట్ కొరకు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరిగితే ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఈ ఆదాయ సర్టిఫికెట్ల తోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామందికి రేషన్ కార్డులు లేకపోవడం వలన ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈ రాజీవ్ యువ వికాస్‌కు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.

 ఎన్నం ప్రకాష్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు