భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం కమలాపురం మూడో పంప్ హౌస్ ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ,అనంతరం మోటార్లను ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.