15-03-2025 11:53:54 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ నియోజకవర్గంలో కేసీఆర్ కంటే ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. గజ్వేల్ లో రైతు రుణమాఫీ నిజాలను భట్టి విక్రమార్క బయటపెట్టారు. బీఆర్ఎస్(2018) రూ. 104.3 కోట్లు చేస్తే.. కాంగ్రెస్ (2024) – రూ. 237.33 కోట్లు రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ(Loan waiver) జరిగిందని భట్టి విక్రమార్క చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఆయన లెక్కలు చెప్పారు.
జనగామ నియోజకవర్గంలో రూ. 263.34 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలో రూ. 237.33 కోట్లు రుణమాఫీ, సిద్దిపేట నియోజకవర్గంలో రూ. 177.91 కోట్ల రుణమాఫీ, సిరిసిల్ల నియోజకవర్గంలో రూ. 175.84 కోట్ల రుణమాఫీ, నిర్మల్ నియోజకవర్గంలో రూ. 202 కోట్ల రుణమాఫీ, నర్సాపూర్ నియోజకవర్గంలో రూ.252 కోట్ల రుణమాఫీ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రూ. 99 కోట్ల రుణమాఫీ,ముథోల్ నియోజకవర్గంలో రూ. 341 కోట్ల రుణమాఫీ,ఆర్మూర్ నియోజకవర్గంలో రూ. 129.05 కోట్ల రుణమాఫీ, బాల్కొండ నియోజకవర్గంలో రూ. 169.95 కోట్ల రుణమాఫీ, ఆదిలాబాద్ నియోజకవర్గంలో రూ.179 కోట్ల రుణమాఫీ, దుబ్బాక నియోజకవర్గంలో రూ. 284 కోట్ల రుణమాఫీ,హుజురాబాద్ నియోజకవర్గంలో రూ. 219 కోట్ల రుణమాఫీ, జరిగిందని భట్టి విక్రమార్క లెక్క చెప్పారు.
రైతు రుణమాఫీపై కావాలనే బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీపై ఖాతాల వారీగా వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ సమాచారం అన్ని నియోజకవర్గాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నాయన్నారు. సభలో సభ్యులు గౌరవంగా మాట్లాడాలని భట్టివిక్రమార్క సూచించారు. పథకాల కోసం ఖర్చ పెట్టిన ప్రతి పైసాపై లెక్కలు ఇస్తామని ఆయన వివరించారు. మేము ఏం చేస్తున్నామో.. పథకాల లబ్ధిదారులకు తెలుసని విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా అభివృద్ధి చేస్తున్నారని, అన్ని హామీలు అమలు చేస్తున్నారు కానీ ప్రచారం చేసుకోవడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. సరిగ్గా ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్‌కి తిరుగే ఉండదని చాలామంది ప్రజలు అంటున్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.