calender_icon.png 22 April, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్ 14న గద్దర్ అవార్డులు

22-04-2025 11:25:22 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలను సైతం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులపై నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ గుండెచప్పుడును గద్దర్ తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు గద్దర్ బాణి, పాటలను అనుకరిస్తారించే వారని చెప్పారు. తెలంగాణ మాలిదశ ఉద్యమ సమయంలో గద్దర్ తన పాటతో ఉద్యమానికి ఊపిరి పోశారని,  ఇవాళ ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయమన్నారు. హైదరాబాద్ లో జరిగే చలన చిత్ర అవార్డుల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ సీఏం భట్టి హామీ ఇచ్చారు.

జూన్ 14వ తేదీన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ అవార్డుల కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని ఈ సందర్భంగా కోరారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ చలన చిత్ర పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఏర్పాటైంది. ఈ జ్యూరీ కమిటికి ఛైర్మన్ గా నటి జయసుధను ఎంపిక చేశారు. అన్ని విభాగాల నుంచి 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరిలో 1172, ఫిచర్ ఫిల్మ్, చిల్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. చలన చిత్ర అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.