హైదరాబాద్: సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష నిర్వహించారు. మరో 4 నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆదేశించారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. నైనీ బ్లాక్ విషయంలో ఇటీవల భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే.