calender_icon.png 27 December, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు

14-07-2024 05:46:56 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తెలిపారు. మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని, మిగిలిన ఉద్యోగాలను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని భట్టీ చెప్పారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని, 19,717 మంది టీచర్లకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీ చేశామని భట్టీ విక్రమార్క చెప్పారు. జూలై 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. డీఎస్సీ అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారని డీప్యూటీ సీఎం పేర్కొన్నారు. అందుకే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదని, గ్రూప్-2ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారని డిప్యూటీ సీఎం భట్టీ గుర్తు చేశారు. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదన్నారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడవే మా ప్రభుత్వం లక్ష్యం అని భట్టీ వ్యాఖ్యానించారు. హాస్టల్ వెల్ఫేర్ కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5 వేల నుంచి 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ  త్వరలో ఉంటుందని భట్టీ విక్రమార్క వెల్లడించారు.