28-02-2025 02:11:41 PM
హైదరాబాద్: బ్యాంకర్ల త్రైమాషిక సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పాల్గొన్నారు. రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకం ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ, ప్రపంచాన్ని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించాలని భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి రూ. 6,000 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి 2న వనపర్తిలో సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. గత పదేళ్లు పాలించిన వారు సంక్షేమ రంగాన్ని పక్కన పడేశారని విమర్శించిన భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తాము ప్రాధాన్యత రంగంగా భావిస్తున్నామని తెలిపారు.
దేశ ఆలోచనను ముందుకు తీసుకుపోయే విధంగా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి(Solar power generation), పెట్టుబడులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుదారులకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు, శాంతిభద్రతలు మంచి వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండని ఉపముఖ్యమంత్రి సూచించారు.