21-03-2025 11:37:03 AM
హైదరాబాద్: సభా నాయకుడికి అజ్ఞానం అని మాట్లాడడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) సూచించారు. మీకు బుద్ధి మాంద్యం ఉందని మాట్లాడడం సరికాదని తెలిపారు. విజ్ఞులైతే స్పీకర్ చెప్పింది విని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. సభాపతితో కూడా వాగ్వాదం సరికాదని హితువు పలికారు. మాకు బుద్ధి ఉందో.. మీకు ఉందో.. లెక్కలు వేసుకుని చెబుతామని విక్రమార్క( Bhatti Vikramarka) పేర్కొన్నారు. సభా నాయకుడు.. ప్రభుత్వ పెద్దల గురించి సరైన భాష వాడాలని తెలిపారు. బడ్జెట్ పరిధి దాడి అడ్డుగోలుగా మాట్లాడడం సబబుకాదని ఆయన మందలించారు.