హైదరాబాద్,(విజయక్రాంతి): వికారబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతాం అనుకున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యం అని భట్టీ విక్రమార్క పేర్కొన్నారు. అధికారులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ నాయకులు అమాయక గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని, మీ కోసం ఈ అమాయక ప్రజలు నష్టపోవాలా..? అని భట్టీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేలా చేశారని, ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే పని పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాలు కోరుకుంటున్నారని భట్టీ విక్రమార్క పేర్కొన్నారు.