హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా(Rythu Bharosa)పై కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కింపు చేపట్టనుంది.