calender_icon.png 10 January, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌టీఎఫ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన భట్టి

07-01-2025 12:19:58 AM

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఎస్‌టీఎఫ్ ఉద్యోగ సంఘం క్యాలెండర్, డైరీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమవారం ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌టీఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు దేవరకొండ సైదులు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్ ప్రధాన కార్యదర్శి పోచయ్య, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.