హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఢిల్లీలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజర య్యా రు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి రాష్ట్రానికి సంబంధించి విద్యు త్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.