calender_icon.png 25 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో భట్టి పీఏ శ్రీనివాస్ మృతి

25-02-2025 12:00:00 AM

మంత్రులు, పలువురి సంతాపం 

ఖమ్మం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : రాష్ర్ట డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకులు (పిఏ) తకేళ్ళపల్లి శ్రీనివాసరావు సోమవారం  ఖమ్మం లో గుండెపోటుతో మరణించారు.ఐసీడీఎస్‌లో సూపరింటెండెంట్‌గా ఉన్న శ్రీనివాస్ గత ఆరేళ్లుగా భట్టి వద్ద పిఏ గా డిప్యుటేషన్ పై పని చేస్తున్నారు.

ఖమ్మం లోని స్వగృహంలో ఆయనకు ఛాతి లో నొప్పి రావడంతో ఖమ్మం లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారుశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, భట్టి సతీమణి మల్లు నందిని,వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పొంగులేటి సంతాపం..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ)  శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.