calender_icon.png 15 January, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టికి ఆహ్వానం

16-09-2024 12:37:16 AM

18 నుంచి మెక్సికోలో మీటింగ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశం న్యూ వోలియోన్‌లోని మోంటిగ్రో నగరంలో 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్కకు ఆదివారం ఆహ్వానం అందింది. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో జరగనున్న ఈ సమావేశాలకు రావాల్సిందిగా భట్టిని నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ వేడుకలో నోబె ల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదు ల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహి స్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో  తెలిపారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశం లో రూపొందిస్తామని వివరించారు. 

గుజరాత్‌కు భట్టి..

ఇదిలా ఉండగా.. గుజరాత్ రాష్ర్టంలోని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు జరగనున్న 4వ రెనబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో-2024లో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం బయలుదేరారు.