హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా వేద పండితులు వారి కి స్వాగతం పలికారు. ఆమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వాదం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందచేశారు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్ 75వ జయంతి సభలో తెలంగా ణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు తెలిపారు. ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.