calender_icon.png 28 November, 2024 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ కార్యవర్గంలోకి భట్టాచార్య

28-11-2024 04:14:56 AM

భారతీయ మూలాలున్న వ్యక్తికి కీలక పదవి

న్యూఢిల్లీ, నవంబర్ 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో భారతీయ మూలాలున్న  భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐ హెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎన్‌ఐహెచ్ అమెరికా వైద్య పరిశోధనలను పర్యవేక్షిస్తోంది.

కాగా జై భట్టాచార్య 1968లో కోల్‌కతాలో పుట్టారు. 1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డాక్టరేట్ అందుకున్నారు. మూడేళ్ల తర్వాత అదే యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేశారు. కొవిడ్ టైమ్‌లో అమెరికా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.