27-03-2025 07:04:18 PM
మేడ్చల్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రవణ్ ను సన్మానించారు. అనంతరం ఆయనా మాట్లాడుతూ... ఉద్యమకారుడికి పదవి దక్కడం అభినందనీయం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని ఆయన తెలిపారు.