27-03-2025 07:19:31 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ తండాకి చెందిన దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. వారి కుటుంబ సభ్యులను గురువారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. గత రెండు రోజుల క్రితం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ గుండె పోటుతో మృతి చెందడం వలన వారి స్వగ్రామం రాంపూర్ తండాకి వెళ్ళి అంబర్ సింగ్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల ప్రజా ప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.