calender_icon.png 14 January, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాసద్ మచా.. డ్యాన్స్ రచ్చ!

12-01-2025 12:00:00 AM

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవా’. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పావైల్ గులాటి కీలక పాత్ర పోషించాడు. ఆయన కూడా ఈ చిత్రంలో పోలీస్‌గానే నటించాడు. జనవరి 31న విడుదల కానున్న ఈ సినిమా నుంచి శనివారం ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

‘భాసద్ మచా..’ అనే పేరుతో విడుదల చేసిన ఈ పాట బాణీ, సాహిత్యం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో షాహిద్ కపూర్ డ్యాన్స్, పూజా హెగ్డేతో అతని కెమిస్ట్రీ అద్భుతంగా కనిపించింది. విశాల్ మిశ్రా సంగీత సారథ్యంలో మికా సింగ్, విశాల్ మిశ్రా, జ్యోతిక టాంగ్రీ ఆలపించారు. గీత సాహిత్యం రాజ్‌శేఖర్ అందించారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు.