ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి
మెదక్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మహిళల భద్రతే లక్ష్యంగా భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయని.. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. రెండేళ్లలో భరోసా కేంద్రం ద్వారా 150 కేసులు, 150 అవగాహన కార్యక్రమాలు, 147 కౌన్సిలింగ్ సెషన్లు, బాధితు లకు రూ.27,74,500 పరిహారం ఇప్పించడం జరిగిందని, పది కేసుల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు.
అదనపు ఎస్పీ మహేందర్, భరోసా సెంటర్ లీగల్ అడ్వయిజర్ శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం సౌబర్ క్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషన ల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు విజయ్, కార్తీక్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.సురేఖ, లెక్చరర్లు పాల్గొన్నారు.