నిర్మల్, నవంబర్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన దంపతులు చిన్న చిన్న తగదాలు, మనస్పర్థల వల్ల వేర్వేరుగా ఉంటున్నారు. వారికి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించి రాజీమార్గం ద్వారా 52 జంటలను ఏకం చేశారు. మీకోసం కార్యక్రమం లో భాగంగా ఎస్పీ జానకీ షర్మిల భరోసా సెంటర్‌లో ఆశ్రయం పొం దుతున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విడిపోవడా నికి కారణాలు తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి ఏకం చేశారు. అనంత రం వారితో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు సమంజళి, సుమలత, జ్యోతిమణి పాల్గొన్నారు.