17-03-2025 08:31:45 PM
ఎస్పీ డివి శ్రీనివాస్ రావు..
బాధితులకు ఆర్థిక సాయం అందజేత..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాధిత మహిళలకు, పిల్లలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని ఎస్పీ బీ శ్రీనివాసరావు అన్నారు. లైంగిక దాడికి గురైన ఆరుగురి మహిళలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను సోమవారం ఎస్పీ బాధిత మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... బాధితుల్లో భరోసా నింపడం కోసమే భరోసా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. భరోసా ఆధ్వర్యంలో పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధితులకు పోలీస్ సేవలు, కౌన్సిలింగ్, వైద్య, న్యాయ సేవలను అందించడం జరుగుతుందన్నారు. బాధితులు 8712670561, 100 సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి కరుణాకర్, భరోసా సెంటర్ ఇంచార్జ్ ఎస్సై తిరుమల, లీగల్ సపోర్ట్ పర్సన్ శైలజ, ఎస్ బి సిఐ రాణా ప్రతాప్, శ్రీధర్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.