హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నూట్రీషన్ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్)డైరెక్టర్‌గా బుధవారం డాక్టర్ భారతి కులకర్ణి బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రవేత్తగా ఆమె ప్రజారోగ్య సంరక్షణ, పోషకాహార సమస్యలపై సమగ్ర అధ్యయనం చేశారు. ప్రత్యేకంగా తల్లీ పిల్లల పోషణపై అనేక పరిశోధలు చేసి విశేష గుర్తింపు పొందారు.
20 ఏళ్ల నుంచి ఆమె ఎన్‌ఐఎన్ పరిధిలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఐసీఎంఆర్ చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రీషన్ విభాగ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.