కొత్త జీవితాలు సినిమా 1981 జనవరి 24న విడుదలైంది. ఈ సినిమాలో సుహాసిని, హరి ప్రసాద్, గుమ్మడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రవీంద్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై రావుల అంకయ్య గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. పీ భారతీ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. దీన్ని తన సొంత తమిళ చిత్రం ‘పుతియా వార్పుగల్’కి రీమేక్‌గా తెరకెక్కించారాయన.
పాఠశాల ఉపాధ్యాయురాలైన జ్యోతి, నిజాయితీపరుడైన గోపాల్‌తో ప్రేమలో పడుతుంది. జ్యోతిని ధనవంతుడు, భూస్వామి అయిన రాజు వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆమె గోపాల్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలుసుకుని వారిద్దరినీ విడదీయడానికి గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. రాజు ప్రయత్నాలు ఫలించాయా? జ్యోతి, గోపాల్‌ల వివాహం జరిగిందా.. లేదా? చివరకు జ్యోతి ఎవరిని వివాహమాడింది? వంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.