23-04-2025 12:06:19 AM
నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా జడ్జిగా జి.వి.ఎన్ భరతలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది, న్యాయవాదులు కలిసి స్వాగతం పలికారు. భరత లక్ష్మి హైదరాబాద్‌లోని లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా పనిచేశారు.
ఇటీవల న్యాయ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆమె నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. మొన్నటివరకు నిజామాబాద్ జిల్లా జడ్జిగా కొనసాగిన సునీత కుంచాల పెద్దపల్లి జిల్లా జడ్జిగా బదిలీఅయ్యారు. ఆమె ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పనిచేసి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు.