calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్

15-04-2025 01:20:21 AM

  1. ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహణ
  2. హాజరవనున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ 

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్-2025 నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరిద్దరు మాట్లాడా రు. భారత్ సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్ర భుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలపై అధ్యయ నం చేసేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ అడవులపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై మం త్రులు స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా అ డవులను నరకలేదని, జంతువులను చంపలేదని తేల్చి చెప్పారు. అడవులను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.