calender_icon.png 25 April, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవాళ, రేపు హెచ్ఐసీసీ వేదికగా భారత్ సమ్మిట్

25-04-2025 10:45:21 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): నెహ్రూ స్పూర్తీతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2025 ను హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో జరుగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ, జవహర్‌లాల్ నెహ్రూ అలీన విధాన స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ఈ సమ్మిట్ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై లోతైన చర్చలకు ఒక వేదికగా నిలవనుంది. 

రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం, ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ సమ్మిట్ ద్వారా ప్రజాస్వామ్య విలువలకు మళ్లీ జీవం పోసే ప్రయత్నం జరుగుతుంది. ఉదయం 10.30గంటలకు సమ్మిట్ ప్రారంభమవుతుంది. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ సంతాపం తెలపనుంది. భారత్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా భారత్ సమ్మిట్ జరుగనుంది. ఈ సమ్మిట్ లో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ తెలిసేలా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది.


భారత్ సమ్మిట్ 2025 మొదటి రోజు కార్యక్రమాలు:

  1. ఉదయం 7.30 - 10:30 వరకు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ విజిట్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన ఎలా జరుగుతోందనే అంశంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.
  2. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు  జెండర్ జస్టిస్ కార్యక్రమంలో లింగ సమానత్వం, మహిళా హక్కులపై చర్చ.
  3. మధ్యాహ్నం 1:30 PM – 2:45 వరకు ఫాక్ట్స్ వర్సెస్ ఫిక్షన్ కార్యక్రమంలో సమాచార వాస్తవాలు VS అపోహలపై చర్చ.
  4. మధ్యాహ్నం 2:45 PM నుంచి సాయంత్రం 4:00 వరకు యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో కార్యక్రమంలో యువత భవిష్యత్తు రాజకీయాల్లో పాత్రపై చర్చ.
  5. మధ్యాహ్నం 2:45 నుంచి సాయంత్రం  4:15 వరకు షేపింగ్ న్యూ మల్టీలేటరలిజంలో కొత్త ప్రపంచ కూటముల దిశగా చర్చ.
  6. మధ్యాహ్నం 2:45 నుంచి సాయంత్రం  4:00 వరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రెజెంటేషన్ లో అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై రాష్ట్ర విజన్ పంచడం.
  7. సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 6:00 వరకు ప్లీనరీ సెషన్ లో ముఖ్య చర్చలు, ఆలోచనల సమీక్ష జరుగనుంది.

26వ తేదీ – రెండవ రోజు కార్యక్రమాలు:

  1. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఓవర్‌కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ లో విభేదాలను అధిగమించేందుకు సమవైభవంపై చర్చ. 
  2. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు క్లైమేట్ జస్టిస్ & ఎకనామిక్ జస్టిస్ లో వాతావరణ న్యాయం, ఆర్థిక న్యాయం అనిశ్చిత కాలంలో ఎలా సాధించాలో చర్చ.
  3. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఏ మల్టీ పోలర్ వరల్డ్ లో శాంతి, న్యాయం, బహుళ ధ్రువ ప్రపంచంలో వాటి ప్రాధాన్యం.
  4. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:30 వరకు వాలిడిక్టరీ సెషన్ లో ముగింపు సదస్సు, ముఖ్య వ్యాఖ్యలు, ధ్యేయాల పునర్నిరూపణ.
  5. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:00 వరకు విజిట్ టు ఇందిరా మహిళాశక్తి బజార్ లో మహిళల స్వయం సహాయక సంఘాల బజార్ సందర్శన, కార్యకలాపాల పరిచయం జరుగనుంది.