26-04-2025 03:53:23 PM
హైదరాబాద్: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్(Bharat Summit)2025 శనివారం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఆధ్వర్యంలో రెండో రోజు భారత్ సమ్మిట్ జరుగుతోంది. భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. వివిధ అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చలు కొనసాగుతున్నాయి. బహుళత్వం-వైవిధ్యం, పోలరైజేషన్ ను అధిగమించడం, వేగవంతమైన న్యాయం, అనిశ్చితికాలంపై ఆర్థిక న్యాయం, ప్రపంచ శాంతి, న్యాయం అనే అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చిస్తున్నారు.