మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): స్కిల్ యూనివర్సిటీకి మన్మో హన్‌సింగ్ పేరు పెట్టాలనే మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేశం ఆయనను కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అణగారిన ప్రజల కోసం సంక్షేమ పథకాల ను ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడని, మానవతావాది అని కొనియాడారు. మన్మోహన్ పేరును స్కిల్ వర్సిటీకి పెట్టాలని, భారతరత్న ఇవ్వాలని తెలిపారు. ప్రాధానిగా మన్మోహన్‌సింగ్ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాలను గుర్తు చేసుకున్నారు.