calender_icon.png 21 January, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు భారత్‌గౌరవ్ రైలు

21-01-2025 12:02:50 AM

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): దేశ సాంస్కృతిక వార సత్వం, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను, ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లను తీసు కొచ్చింది. వీటిని ఇప్పటివరకు వివి ధ ప్రాంతాలకు నడిపిన రైల్వేశాఖ ఇప్పుడు కోట్లాది మంది హాజరవుతున్న కుంభమేళాకు సైతం సిద్ధం చేసింది.

సోమవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కుంభమేళా స్పెషల్ భారత్ గౌరవ్ రైలు బయలుదేరింది. వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య పుణ్యక్షేత్రాలను ఈ రైలు కవర్ చేస్తుంది. కాగా ఇలాంటి మరో ప్ర త్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది. ఆసక్తి ఉన్న ప్రయాణీకులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ http://www.irct ctourism.com ను, సికింద్రాబాద్ స్టేషన్‌లో 040 9701360701, 9281495845, 9281495843, 8287932228, 9281030740, 9281030749 నెంబర్లలోనూ సంప్రదించవచ్చు.