20వ తేదీ వరకు సాగనున్న యాత్ర
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు(భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు) బుధవారం బయలుదేరింది. డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు సాగే ఈ యాత్రలో రామజన్మభూమి (అయోధ్య), కాశీ విశ్వనాథ్ ఆలయం సందర్శన, గయలో పిండ ప్రదానానికి రైల్వే శాఖ అవకాశం కల్పించింది. సికింద్రాబాద్ నుంచి భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, వైజాగ్ (పెందుర్తి), విజయనగరంలో ఈ రైలు ఆగుతుంది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంపై ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్‌కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయని, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు మరో మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు (భారత్ గౌరవ్ టూరి స్ట్ రైలు) సికింద్రాబాద్ నుంచి బ యలుదేరుతుం దని, యాత్రికులు <http:// www.irctctourism.com> ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు శనివారం నుంచి జనవరి 18వ తేదీ వరకు ద.మ.రైల్వే 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కొల్లాం (రైలు నెం.07175) జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాెం సికింద్రాబాద్ (రైలునెం. 07176) జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తాయన్నారు. వీటితో పాటు ఏపీ నుంచి కూడా ప్రత్యేక రైళ్లు శబరిమలకు నడుపుతున్నామన్నారు.