calender_icon.png 29 April, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భానుడి భగ భగ

29-04-2025 12:54:56 AM

నిప్పుల కొలిమిలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా

కరీంనగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): భానుడు రోజు రోజుకు భగభగ మండుతుండడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనికి వెళ్లేవా రు, రోజువారీ కూలీలు ఎండలకు తాళలేక మంచాన పడుతున్నారు.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండగా వైద్యులు, వాతా వరణ నిపుణులు ప్రజలకు బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. వడగాలలు వేడి మధ్య ప్రజలు జాగ్రత్తే ప్రాణరక్ష అంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదుతుండగా రానున్న మూడు రోజులు మరింత ఎం డలు ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని, తురచూ నీళ్లు తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో 40.6, పెద్దపల్లి జిల్లాలో 40.3, కరీంనగర్ జిల్లాలో 39.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మంగళవారం పెద్దపల్లి జిల్లాలో 41.4, జగిత్యాల జిల్లాలో 41.4, కరీంనగర్ జిల్లాలో 40.5, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39.8 డిగ్రీల వరకు, బుధవారం పెద్దపల్లి జిల్లాలో 43.5, జగిత్యాల జిల్లాలో 43, కరీంనగర్ జిల్లాలో 42.4, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్నది. ఉమ్మడి జిల్లాలో  ఇప్పటివరకు వడ దెబ్బకు నలుగురు మృత్యువాత పడ్డారు.

జాగ్రత్తలు తప్పనిసరి...

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు బయటకు రావద్దు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ కట్టుకోవాలి. చర్మాన్ని కప్పే బట్టలు ధరించాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, గుండెపోటు రిస్క్ ఉన్నవారు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి.

ఒక్కసారి ఎండ నుంచి చల్లని చోటుకు వెళ్లకూడదు. కొందరు ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతున్నారు. వాంతులు, వీరేచనాలతో ప్రజలు ఆసుపత్రులకు వస్తున్నారు. పిల్లలు, గర్బిణీలు, వృద్ధులకు సమ స్య తీవ్రంగా కనిపిస్తోంది. కళ్లు, ముక్కు నుం చి నీళ్లు కారడం, ఒళ్లంతా మంటలతో చికిత్స పొందుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ఎండతీవ్రత నుంచి రక్షించుకోవాలి.